విశాలాంధ్ర ధర్మవరం; 19 వ నేషనల్ ఫ్లోర్ బాల్ ఛాంపియన్షిప్ 2025-26 శ్రీ సత్య సాయి జిల్లా తరఫున జాతీయ స్థాయిలో విజయం సాధించినట్లు హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ కళ్యాణదుర్గం లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అండర్ -14 విభాగంలో 14 మంది జాతీయ సాయి పోటీలలో పాల్గొనగా అందులో వ 12 మంది అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఈ 12 మంది విద్యార్థినీలలో 8వ తరగతిలో హేజస్విని, అప్నా అంజన్, రోహిణి, సాయి గీతిక, హేమశ్రీ, జాహ్నవి, కాగా 9వ తరగతిలో తేజశ్రీ, నందిని, ఉషశ్రీ, శ్రీదేవి, ఈశ్వరి, గౌతమి, ఎంపిక కావడం జరిగింది అన్నారు. ఆగస్టునెలలో నరసరావుపేట లో 15 మంది ఫ్లోర్ బాల్ పోటీలలో పాల్గొని రాష్ట్రస్థాయికి ఏపిక కావడం జరిగిందన్నారు. అనంతరం బిఎస్సార్ బాలుర ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ మేరీ వర కుమారి, బాలికల ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కలిసి పట్టణంలో విజయోత్సవాలను డప్పు వాయిద్యాలు నడుమ ర్యాలీగా నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయి కి ఎంపికైన 12 మంది సెప్టెంబర్ నాలుగవ వారము లేదా అక్టోబర్ మొదటి వారములలో సింగపూర్ లో నిర్వహించబడే పోటీలలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఫ్లోర్ బాల్ పోటీలలో ఎంపికైన 12 మంది విద్యార్థినీలను బాలికల హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి, బాలుర హెడ్మాస్టర్ మేరీ వర కుమారి, కళ్యాణదుర్గం పిఈటి లక్ష్మీనారాయణ, పాఠశాల కమిటీ చైర్మన్ బాబావలి, వార్డు కౌన్సిలర్ వెంకట్రాముడు, బీరే కేశవ, బీరే ఎర్రి స్వామి,ఫిజికల్ డైరెక్టర్ ఎన్. లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు ప్రకాష్, సురేష్, శ్రీనివాసులు, రవీంద్రారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితర ఉపాధ్యాయులు, బోధ నేతర బృందం, పాఠశాల కమిటీ చైర్మన్, సభ్యులు కలిసి అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
జాతీయ స్థాయిలో ఫ్లోర్ బాల్ పోటీలలో మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ
- Advertisement -
RELATED ARTICLES


