Homeఆంధ్రప్రదేశ్వైసిపి దుష్ప్రచారం మానుకోవాలి..ఎమ్మెల్యే కందికుంట

వైసిపి దుష్ప్రచారం మానుకోవాలి..ఎమ్మెల్యే కందికుంట

- Advertisement -

విశాలాంధ్ర,కదిరి…అభివృద్ధి సంక్షేమంపై వైసిపి దుష్ప్రచారం మానుకోవాలని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఆర్ అండ్ బి బంగ్లా లో నియోజకవర్గం లోని 33మందికి రూ. 29,82,196 సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణి చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలల కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అభివృద్ధి, ప్రజాసంక్షేపం పరుగులు పెడుతుందన్నారు. దీన్ని చూసి వైసీపీ నాయకులు ఓర్వలేక అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారనిఆవేదన వ్య క్తం చేశారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై స్పష్టమైన నమ్మకం కలిగిందన్నారు.వైసీపీని ప్రజలు,రైతులు ఎన్ని చెప్పిన నమ్మే పరిస్థితిలో లేరని హితువు పలికారు.రానున్న కాలంలో నియోజకవర్గంలోని ప్రతి చెరువును హంద్రీనీవా నీటితో నింపుతామని భరోసా ఇచ్చారు.గంజాయి వాడకంపై ఉక్కపాదం మోపుతామన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు