విశాలాంధ్ర పుట్టపర్తి:- భూములు ఇస్తే భూమి ఇచ్చిన కుటుంబంలో ఒక్కొక్కరికి ఉద్యోగం ఇస్తామని చెప్పి లెదర్ ఫ్యాక్టరీ యాజమాన్యం పంగనామం పెట్టిందని రైతులు వాపోయారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో ఈమెరకు మహిళల ఇన్చార్జి డిఆర్ఓ కు ఫిర్యాదు చేశారు.శ్రీ సత్య సాయి జిల్లా బత్తలపల్లి మండలం రాళ్ల అనంతపురం వద్ద సర్వే నంబర్లు 28,29,32,33 లో 23.89 ఎకరాల భూమిని లెదర్ ఫ్యాక్టరీ కోసం కేటాయించారన్నారు .భూములు ఇచ్చే క్రమంలో భూములు ఇచ్చిన ప్రతి కుటుంబంలోనూ ఒక్కొక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదని మహిళలు వాపోయారు. బాధిత మహిళలు మాట్లాడుతూ ఉన్న భూమిని కోల్పోవడంతో జీవనోపాధిని కోల్పోయామని, ఉద్యోగాలు కూడా లేకపోవడంతో జీవనం సాగించడం కష్టతరంగా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మా సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినట్లు తెలియజేశారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ రైతులు పాల్గొన్నారు.
భూములిస్తే ఉద్యోగం ఇస్తామని పంగనామం..
- Advertisement -
RELATED ARTICLES


