ముగ్గురికి తీవ్ర గాయాలు…

విశాలాంధ్ర, గోరంట్ల,.. శ్రీ సత్యసాయి జిల్లా. బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిలోని గోరంట్ల మండలంలోని పాలసముద్రం క్రాస్ సమీపంలో ఆదివారం ఉదయం ట్రక్కును స్కార్పియో వాహనం ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన చోటుచేసుకుంది, సీఐ బోయ శేఖర్ తెలిపిన వివరాల మేరకు…బెంగళూరు నుంచి అనంతపురం వెళుతున్న స్కార్పియో వాహనం ఎదురుగా వెళుతున్న ట్రక్కు వాహనమును దాటబోయి ట్రక్కు వెనుక భాగంలో ఢీ కొనడంతో విజయ కుమారి తో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు గాయపడి ఒకరికి కాలు విరిగినట్లు తెలిపారు,వెంటనే గోరంట్ల లో ప్రథమ చికిత్సలు అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం సవేరా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


