Homeజిల్లాలుశ్రీ సత్యసాయిశ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ చోరీ

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ చోరీ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సిద్దయ్య గుట్టలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉండి రెండవసారి దొంగతనమునకు గురైంది. ఆలయ కమిటీ అధ్యక్షురాలు సంకారపు జయ శ్రీ, ఉపాధ్యక్షులు పుట్లూరు నరసింహులు మాట్లాడుతూ గతంలో హుండీని పగలగొట్టి, అందులో డబ్బులు కూడా దొంగతనం చేయడం జరిగిందని, తర్వాత ఆ దొంగ తెలివిగా తన దగ్గర ఉన్న బీగమును వేసి వెళ్లిపోయాడు అని తెలిపారు. మామూలుగా 15 రోజులకు ఒకసారి ఉండి లెక్కింపు చేయడం జరుగుతుండేదని తెలిపారు. కొద్దిరోజుల తర్వాత చూడగా బేగం తేడా ఉండడంతో తిరిగి నూతన బీగమును వేయడం జరిగిందన్నారు. హుండీ దొంగతనమునకు గురికావడం జరిగిందని తెలిపారు. హుండీలో బీగాన్ని పగలగొట్టి, సొమ్ముతో పరారయ్యాడని తెలిపారు. అనంతరం చోరీ జరిగిన విషయాన్ని తెలుసుకొని దాన్ని పరిశీలించగా హుండీలో డబ్బు దొంగతనానికి గురైందని గుర్తించడం జరిగిందన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి లెక్కింపు జరుగుతుండేదని, దాదాపుగా 3000 రూపాయల వరకు వచ్చేదని తెలిపారు. రెండవసారి కూడా హుండీ దొంగతనంకు గురి కావడం జరిగిందన్నారు. దీంతో ఆలయ కమిటీ వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. రాత్రిపూట గస్తీ ఉండేలా చూడాలని సిఐను కోరడం జరిగింది అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు