Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రైవేట్ మెడికల్ లేబరేటరీ ప్రొఫెషనల్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ

ప్రైవేట్ మెడికల్ లేబరేటరీ ప్రొఫెషనల్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం:: మంగళగిరిలోని ఆర్బి కన్వెన్షన్ హాల్ లో నవ్యాంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లాబరేటరీ ప్రొఫెషనల్ అసోసియేషన్ నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు డాక్టర్ గౌతమ్ రాజ్ సంఘం సభ్యులు లోగోను ఆవిష్కరించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడిగా టి హరిబాబును ఎన్నుకోవడం జరిగింది. తదుపరి శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన వి. దినేష్ ను రాష్ట్ర సహకార దర్శిగా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర ఈసీ నెంబర్ గా కె. ప్రకాష్, జె రవి ని ఎన్నుకోవడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ దాదాపుగా 20 నుండి 25 వేల మెడికల్ లాబరేటరీలను ఒకే వేదికపై తీసుకొని వచ్చి వారి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ప్రతి టెక్నీషియన్ కి ఇన్సూరెన్స్ భద్రత కల్పించాలని, ఆరోగ్యశ్రీలో భాగస్వామ్యం కల్పిస్తే దాదాపుగా 20 నుండి 25 వేల ప్రైవేట్ లేబలేటరీ కుటుంబాలకు జీవనో పాధి పొందే అవకాశం ఉంటుందని వారు తెలిపారు. అసోసియేషన్ అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు