విశాలాంధ్ర -ధర్మవరం: అనంతపురం పట్టణంలోని లలిత కళా పరిషత్ వేదిక నందు జానపద మహా బృంద నృత్యం ఉద్యమంలో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన మానస నృత్య కళా కేంద్రం వారి శిష్య బృందం ప్రదర్శించిన నాట్యం అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా గురువు మానస మాట్లాడుతూ దాదాపుగా 2000 మంది శిష్య బృందంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ధర్మవరం పట్టణం కి చెందినటువంటి మానస నృత్య కళాకేంద్రం వారి శిష్య బృందం మరియు చందు డాన్స్ అకాడమీ వారి శిష్య బృందం పాల్గొనడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వారు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ వారు ,మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్ వారు విచ్చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం నందు నృత్యం చేసినటువంటి చిన్నారులు అందరికీ కూడా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్ మరియు రంగస్థల సకలవృత్తి కళాకారుల సంక్షేమ సంఘం వారి సర్టిఫికెట్ అందజేయడం జరిగిందన్నారు. అలాగే గురువు ఆర్.మానస, చందు కు అతిధుల చేతుల మీదుగా సత్కరించటం జరిగినది అని తెలిపారు. ఈ కార్యక్రమం నందు మన ధర్మవరం పట్టణానికి చెందినటువంటి వారు మొత్తం 25 మంది చిన్నారులు పాల్గొనడం జరిగిందన్నారు. ఇటువంటి కార్యక్రమంలో మేము పాల్గొనడం ఎంతో సంతోషాన్ని తృప్తిని ఇచ్చిందని తెలిపారు.
ఆకట్టుకున్న మానస నృత్య కళాకేంద్రం ప్రదర్శన
- Advertisement -
RELATED ARTICLES


