విశాలాంధ్ర- చింతలపూడి : గలగలా మాట్లాడే ఆ గొంతు మూగబోయింది…అనంతమైన ఆత్మీయానురాలను పంచిన చక్రపు చిట్టెమ్మ(80) గడచిన 14 ఏళ్లుగా పక్షవాతం వ్యాధితో పోరాడుతూ తుదిశ్వాసవిడిచింది. చింతలపూడి మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన చిట్టెమ్మ తుది శ్వాస విడవడంతో బుధవారం సాంప్రదాయపద్ధంగా ఆమె కొడుకులు అంత్యక్రియలు నిర్వహించారు. గురుభట్లగూడెంలో ఓ పెద్ద కుటుంబంలో పుట్టి పెరిగిన చిట్టెమ్మ చిన్ననాటి నుండి అందరితో కలిసి మెలిసి ఉండడం, కష్ట సుఖాలను పంచుకోవడం తనవాళ్లు అన్నవాళ్ళకి అండగా నిలవడం ఆమె నైజం .గడచిన పద్నాలుగు సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లి మళ్లీ ఊపిరి నిలబెట్టుకునేది. మంగళవారం సాయంత్రం ఆమె తుదిశ్వాస విడవడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళ్ళి అర్పించారు. ఆమెకు భర్త ఇద్దరు కొడుకులు ఒకకూతురు ఉన్నారు.
పక్షవాతంతో 14 ఏళ్ళు పోరాడి తుదివిశ్వాస విడిచిన చిట్టెమ్మ
- Advertisement -
RELATED ARTICLES


