Homeజిల్లాలుశ్రీ సత్యసాయినాయి బ్రాహ్మణులు వినూత్న రీతిలో యాచకులకు సేవలు

నాయి బ్రాహ్మణులు వినూత్న రీతిలో యాచకులకు సేవలు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం శాసనసభ్యులు, రాష్ట్ర కుటుంబ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పుట్టినరోజు పురస్కరించుకొని నాయి బ్రాహ్మణులు వినూత్న రీతిలో జిల్లా నాయి బ్రాహ్మణ అధ్యక్షులు మాల్యవంతం చలపతి, పట్టణ అధ్యక్షులు కడియాల నారాయణస్వామి ఆధ్వర్యంలో యాచకులకు సేవలు అందించారు. పట్టణములోని శిరిడీ సాయిబాబా ఆలయం వద్ద అపరిశుభ్రంగా ఉన్న వందమంది యాచకులకు కటింగ్, షేవింగ్ ను చేశారు. అదేవిధంగా వారికి బిజెపి పట్టణ ప్రతినిధి హరీష్ బాబు, పట్టణ అధ్యక్షుడు జింక చంద్రశేఖర్, సాకే ఓబులేష్, గిర్రాజు నగేష్ చేతుల మీదగా దుస్తులు కూడా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా, పట్టణ నాయి బ్రాహ్మణులు ప్రతినిధులతో పాటు, కుల బాంధవులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు