సినీనటుడు సోనూసూద్ బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించిన వ్యవహారంలో విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (జుణ) ముందుగానే సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. నేపథ్యంలో సోనూసూద్ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు.అధికారులు ఆయనను బెట్టింగ్ యాప్‌లకు చేసిన ప్రచారం, వాటితో ఉన్న సంబంధం, తీసుకున్న రుసుములు తదితర అంశాలపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, క్రికెటర్లు కూడా విచారణకు హాజరైన విషయం తెలిసిందే.
ఇందులో సురేశ్ రైనా, యువరాజ్ సింగ్, మంచు లక్ష్మి, రానా వంటి ప్రముఖులు ఇటీవల ఈడీ విచారణకు హాజరయ్యారు.
ఈడీ విచారణకు సోనూసూద్ హాజరు
- Advertisement -


