చాబాల సర్పంచ్ మల్లెల జగదీష్
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం మహిళలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉందని ఈ కార్యక్రమాన్ని మహిళలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని వజ్రకరూరు మండలం చాబాల గ్రామ సర్పంచ్ మల్లెల జగదీష్ తెలిపారు. బుధవారం గ్రామంలో జరిగిన కార్యక్రమాన్ని సర్పంచ్ మల్లెల జగదీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు, అందరూ కూడా వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ పోగ్రామ్ అధికారి డాక్టర్ పద్మ మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలకు, బీపీ, షుగర్ ఉన్నవారికి, పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి విజయకుమార్ సూపర్వైజర్ సరోజమ్మ, వైద్య సిబ్బంది పావని,వరలక్ష్మి,చంద్ర, అంగన్వాడి కార్యకర్త చంద్రమణి, సోమేశ్వరి, శశికళ, సరోజ, ఆశా కార్యకర్తలు లింగమ్మ, ధనలక్ష్మి, మల్లిక మహిళలు పాల్గొన్నారు.


