Homeజిల్లాలుఅనంతపురంజిల్లా కలెక్టర్ ని కలిసిన వైసీపీ జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు వి.గోవింద్ నాయక్

జిల్లా కలెక్టర్ ని కలిసిన వైసీపీ జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు వి.గోవింద్ నాయక్

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఐఏఎస్ ని వైసీపీ జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు వి.గోవింద్ నాయక్ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గిరిజన తండాలలో మురికి కాలువల వల్ల విష జ్వరాలు ప్రబలుతున్నాయని సరైన వసతులు లేక గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వారికి సరైన మంచినీటి సదుపాయం మరియు రోడ్ల సమస్యలు తీర్చాలని అన్నారు. ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యలు పరిశీలించి వారికి న్యాయం చేయాలని అలాగే జిల్లాని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో నడిపించాలని గోవింద నాయక్ జిల్లా కలెక్టర్ ని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సమానాయక్, తిరుమలేస్ నాయక్, దాసునాయక్, రూప నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు