విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పలు కళాశాలలో ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ చైర్మన్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు. ముఖ్యఅతిథిగా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సిరికల్చర్ డాక్టర్ వెంకటస్వామి నాయక్, సిరికల్చర్ అధికారి చెన్నారెడ్డి విచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ యొక్క ప్రాధాన్యతను వారు విద్యార్థులకు వివరించారు. దేశం పట్ల సేవ చేసే స్ఫూర్తిని నింపడమే ఎన్ఎస్ఎస్ పోషించే కీలకపాత్ర అని తెలిపారు.2022-2025 బ్యాచ్ వారికి ఉత్తమ వాలంటీర్లుగా కే.హారిక బిఏ,ఎస్. మారుతి బీకాం ,ఎంఎస్.చరణ్ సాయి బి ఏ లకు మెమొంటోలను సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.
పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ డే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపాల్ ప్రశాంతి పాల్గొని ఎన్ఎస్ఎస్ గూర్చి విద్యార్థులకు తెలియజేశారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కుల్లాయి రెడ్డి ఎన్ఎస్ఎస్ ప్రాధాన్యత గూర్చి, దేశంలో ఎన్ఎస్ఎస్ యొక్క విలువను గూర్చి తెలియజేశారు. అనంతరం విద్యార్థులతో ఎన్ఎస్ఎస్ ప్రతిజ్ఞ చేయించారు.పట్టణంలోని రేగాటిపల్లి రోడ్ శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల యందు ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలను ఎన్ఎస్ఎస్పిఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్, ఇన్చార్జి రమేష్ ఎన్ఎస్ఎస్ ప్రాముఖ్యతను గూర్చి వివరిస్తూ కళాశాల ఆవరణములో మొక్కలను నాటారు. అనంతరం కళాశాల ప్రాంగణంలోని చెత్త ప్లాస్టిక్ ను తొలగించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలు
- Advertisement -
RELATED ARTICLES


