Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజాతీయ అవార్డు పొందిన డిజైనర్ జూజారే నాగరాజ్

జాతీయ అవార్డు పొందిన డిజైనర్ జూజారే నాగరాజ్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన డిజైనర్ జుజారే నాగరాజు దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం జాతీయ అవార్డును రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ 7 ఆగష్టు 2025 (జాతీయ చేనేత దినోత్సవం) రోజున, ధర్మవరం పట్టణమునకు చెందిన జూజారే నాగరాజు చేనేత డిజైన్ డెవలప్మెంట్ నందు జాతీయ అవార్డును, కేంద్ర మంత్రుల ద్వారా న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం నందు అందుకున్నారు. కానీ ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూ చేతుల మీదుగా అందుకోవాల్సి వుంది అని, ఆరోజున రాష్ట్రపతి ముఖ్యమైన కార్యక్రమం ఉండటం వలన అవార్డుల సమావేశానికి హాజరుకాలేక పోయినారు అని తెలిపారు. తరువాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో అవార్డులు అందుకున్నవారికి రాష్ట్రపతి కలిసే అవకాశం కల్పించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇందులో భాగంగా 24 సెప్టెంబర్ 2025 న దేశావ్యాప్తంగా జాతీయ అవార్డులు అందుకున్న 24 మందిని రాష్ట్రపతి భవన్ లోనికి విందుకు ఆహ్వానించారు అని, భారతదేశ రాష్ట్రపతి ద్రౌపతి మూర్మూ తో సమావేశం ఏర్పాటు చేసి, రాష్ట్రపతి భవన్, అమృత్ గార్డెన్ యొక్క విశేషాలను ప్రత్యేకమైన గైడ్ ద్వారా ఒకరోజు మొత్తం అవార్డు పొందినవారికి విశధికరించారు అని తెలిపారు. ఈ అవార్డు చేనేత పరిశ్రమకు, చేనేత కార్మికులకు, ధర్మవరం పట్టణమునకు దక్కుతుందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు