Homeఆంధ్రప్రదేశ్సెలవు దినాలలో ఆదపు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు..

సెలవు దినాలలో ఆదపు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు..

- Advertisement -

గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణ, మండల పరిధిలోని గ్రామాలలో గల ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలలో సెలవులలో అదనపు తరగతులు నిర్వహించరాదని, అలా నిర్వహిస్తే డిఇఓ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎంఈఓ లు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు కూడా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్వహించరాదని తెలిపారు. అలా చేస్తే శాఖపరమైన చర్యలు తప్పవు అని వారు తెలిపారు. అదేవిధంగా సెలవుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం వారు విద్యార్థులను విహారయాత్రలకు తీసుకొని వెళ్లరాదని, అలా వెళ్లేటప్పుడు తప్పనిసరిగా డీఈవో అనుమతి తీసుకొని పోవాలని తెలిపారు. అలా కాకుండా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదాలకు గురి అయితే పాఠశాల యాజమాన్యం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. తదుపరి తల్లిదండ్రులు తమ పిల్లలను వంకలు, గుంతలు, చెరువుల వద్ద ఒంటరిగా పంపరాదని, వర్షాలు సమయంలో కూడా పిల్లలను బయటకి వదలకుండా అప్రమత్తంగా తమ పిల్లల బట్ట జాగ్రత్త తో కూడిన భద్రత వహించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు