Homeవిద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరు

విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరు

- Advertisement -

పాలకుల చర్యలతో పేదలకు విద్య దూరం

. హామీల అమలు` బకాయిల చెల్లింపు
. ఇచ్చాపురం సభలో విరాజ్‌, లవరాజు, నాసర్‌జీ డిమాండ్‌
. అణచివేత చర్యలతో బస్సు యాత్ర ఆగదని నాయకుల స్పష్టీకరణ
. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్‌ఎఫ్‌ ఆందోళనలు

విశాలాంధ్ర – ఇచ్ఛాపురం:విద్యార్థుల భవిష్యత్‌ కోసం రాజీలేని పోరాటాలు చేస్తామని ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు విరాజ్‌ దేవాంగ్‌ ఉద్ఘాటించారు. పేదలకు విద్యను దూరం చేయొద్దని పాలకులను కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, పెండిరగ్‌ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) అధ్వర్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా చేపట్టే బస్సు యాత్రకు అనుమతులు లభించలేదు. దీంతో రాష్ట్ర ఉత్తర ముఖద్వారం ఇచ్చాపురం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ రవి అధ్యక్షతన జరిగిన ఈ సభలో విరాజ్‌ దేవాంగ్‌ ప్రసంగిస్తూ ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు బస్సు యాత్ర ఆగదని తేల్చిచెప్పారు. అడ్డంకులను తొలగిస్తాం… పోరాటాలు కొనసాగిస్తామని నినాదమిచ్చారు. విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలులో, యూనివర్సీటీల వైస్‌ ఛాన్సలర్ల నియామకంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రైవేట్‌ సంస్థలతో ప్రభుత్వ బంధాన్ని బహిర్గతం చేయడమే కాకుండా పాలకుల అసమర్థతలపై ప్రజలకు అవగాహన కల్పించేలా బస్సుయాత్ర సాగిస్తామన్నారు. ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు విద్యార్థుల సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. కళాశాలల్లో ప్రయోగశాలలు, సరైన మౌలిక వసతులు లేవని విరాజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మూడు కోట్ల మంది పై చదువులు చదివారని, వీరిలో ఎనిమిది లక్షల మంది ధనికులే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించగలుగుతున్నారని వెల్లడిరచారు. విద్యకు 0.4 శాతం కాదు కనీసం 17 శాతం బడ్జెట్‌ ఇవ్వాలని సూచించారు. పేద విద్యార్ధులు కూడా కెేజీ నుంచి పీజీ వరకూ చదువుకునే పరిస్థితి కల్పించాలన్నారు. 100లో 76 ప్రైవేటు కళాశాలు రాజకీయ నాయకులవే అని…లోపభూయిష్టమైన బోధనాంశాలతో విద్యా వ్యవస్థ నాశనమవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. అంతర్జాతీయ పోటీని తట్టుకునేలా వ్యవస్థను బలోపేతం చేయాలని, విద్యార్థుల సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలని విరాజ్‌ డిమాండ్‌ చేశారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల లవరాజు, ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌జీ మాట్లాడుతూ అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి వాటి ఊసే మరిచారని దుయ్యబట్టారు. మన్యం జిల్లా పార్వతీపురంలో 116 మంది విద్యార్థులు నీటి కాలుష్టం కారణంగా పచ్చ కామెర్లతో బాధపడితే విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ పట్టించుకోలేదన్నారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధులు రూపుమాపడానికి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్న ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అందుకు ఏ మేరకు నిధులు కేటాయించారో చెప్పాలన్నారు. ఉపకార వేతనాలు, ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.6,400 కోట్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 107,108 జీవోలు రద్దు చేయాలని, పీపీపీ విధానంతో 17 వైద్య కళాశాల నిర్వాహణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ఏకోపాధ్యయయ పాఠశాలల నిర్వహణ సక్రమంగా లేదన్నారు. వసతి గృహాల్లో సదుపాయాలు లేవని, సరైన మెనూ పాటించడం లేదన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ, ఎస్కే యూన్సివర్టీల అభివృద్ధికి నిధులు… సెంట్రల్‌ యూనివర్సిటీ పరిస్థితిపై పాలకుల సమాధానాన్ని డిమాండ్‌ చేశారు. ఉత్తరాంధ్రలో ఎస్‌టీ, ఎస్‌సీ, బీసీ మైనార్టీ, గిరిజన విద్యార్థుల అభ్యున్నతికి చొరవ చూపాలని ప్రభుత్వాన్ని లవరాజు కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఐదు మెడికల్‌ కాలేజీల్లో 50 శాతం సీట్లు ప్రైవేటుగా అమ్ముకుంటే… కూటమి ప్రభుత్వం ఏకంగా 17 వైద్య కళాశాలలను ప్రైవేటుకు అప్పగించిందన్నారు.విశాఖకు గూగుల్‌ తెవడం కాదు మన్యం జిల్లాకు గుక్కెడు మంచినీళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు కులాయిస్వామి, మస్తాన్‌, సోమేస్‌, సాయి, లోకనాధం, సాలిన నారాయణస్వామి, ఆరేలమ్మ, లండ వెంకట్రావు, జిల్లా సమితి సభ్యులు చాపర వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు