కొవ్వూరులో ట్యాంక్ బండ్ పై తిరిగి ప్రారంభమైన అక్రమ కట్టడాలు..
లాంచీలు రేపు వద్ద అక్రమంగా దేవాలయ నిర్మాణం
నిలిపివేసిన అధికారులు
గతంలో ఈ నిర్మాణాలపై విశాలాంధ్రలో కథనాలు.
అధికారులు స్పందించినా ఆగని నిర్మాణాలపై ప్రజలు ఆందోళన.
విశాలాంధ్ర-కొవ్వూరు: కొవ్వూరు గోదావరి గట్టుపై ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన ట్యాంక్ బండ్ అడుగడుగునా ఆక్రమణలకు గురవుతూనే ఉంది. సుమారు నాలుగు నెలల క్రితం లాంచీల రేవు వద్ద పక్కనే ఉన్న ట్యాంకు బండపై ప్రభుత్వ అనుమతి లేకుండా కొంతమంది ఆలయాన్ని నిర్మిస్తున్నారు అన్న విషయం విశాలాంధ్ర దృష్టికి రాగా దేవుడు పేరుతో ఆక్రమణలు అన్న పేరుతో కథనాలను ప్రచురించింది. ఈ నేపథ్యంలో కట్టడ నిర్మాణాన్ని ఆపిన నిర్వాహకులు మరలా గురువారం నాడు నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించారు అన్న వార్త విశాలాంధ్రకు రావడంతో నిజానిజాలను నిగ్గు తేల్చడానికి క్షేత్రస్థాయికి వెళ్ళింది. ఈ నేపద్యంలో ట్యాంక్ బండ్ వద్ద కంకర, ఇసుక గుట్టలు డంప్ చేసి కనిపించాయి. అదేవిధంగా నిర్మాణ స్థలంలో నిర్మాణ పనులు కూడా కనిపించాయి. ఈ మేరకు విశాలాంధ్ర ప్రతినిధిని కూడా ఫోటోలు తీసినట్లు సమాచారం. నిర్మాణ విషయమై మున్సిపల్ కమిషనర్‌ను వివరణ త్వరగా టిపివోను వెంటనే అక్కడికి పంపిస్తానని పేర్కొన్నారు. అదే విధంగా ఇరిగేషన్ ఏఈ మణికంఠ రాజును వివరణ కోరగా తన దృష్టికి కూడా నిర్మాణ విషయం వచ్చిందని వెంటనే ఆపుదలకు చర్యలు తీసుకున్నానని వివరించారు. అధికారులు స్పందించిన తర్వాత కూడా నిర్మాణం జరగడం పట్ల పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవ్వూరు పట్టణానికి వన్నెతెచ్చిన ట్యాంకుబండను కాపాడాలని పలువురు కోరుతున్నారు. అలాగే ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఆక్రమణలను అడ్డుకుంటున్న ఇరిగేషన్, మున్సిపల్ అధికారుల తీరు పట్ల పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


