విశాలాంధ్ర – రాజమండ్రి సిటి ; కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ పదహారు నెలల కాలంలో అనేక రకాలుగా అభివృద్ధి సాధించామని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. స్థానిక జిల్లా బిజెపి కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజమండ్రి ఎంపి పురంధేశ్వరి కృషితో జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు అనపర్తిలో హాల్ట్ సదుపాయం ఏర్పడిందన్నారు. ఈ విషయమై సహకరించిన పురంధేశ్వరి, కేంద్ర రైల్వే శాఖా మంతి అశ్వని వైష్ణవ్ లతో పాటు అనుక్షణం సహకరించిన ఉన్నికృష్ణన్ , ఇతర అధికారులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ హాల్ట్ వల్ల ఒక్క అనపర్తి ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఉన్న మండపేట, రామచంద్రపురం ప్రజలకు కూడా ఉపయోగం చేకూరుతుందన్నారు. ప్రస్తుతం 39 కోట్ల రూపాయలతో అనపర్తి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నామని, అలాగే కేశవరం ప్లైఓవర్ తో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబందించి కూడా ఎంపి పురంధేశ్వరి సహకారం మరువలేనిదన్నారు. అలాగే ఇటీవల బాణా సంచ అగ్నిప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులకు కూడా 15లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సహకారం అందిస్తామన్నారు. ఈ వ్యవహారంలో సహకరించిన కార్మిక మంత్రి, హోం మంత్రి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి తదితరులకు కూడా ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, నర్శిపల్లి హారిక, వీర వీరాంజనేయులతో పాటు ఇతర బిజెపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు
జన్మభూమికి అనపర్తిలో హాల్ట్ పట్లపురంధేశ్వరికి నల్లమిల్లి కృతజ్ఞతలు
- Advertisement -
RELATED ARTICLES


