Homeజిల్లాలుఅనంతపురంవైద్య కళాశాలలో వైట్ కోట్ వేడుక

వైద్య కళాశాలలో వైట్ కోట్ వేడుక

- Advertisement -

విశాలాంధ్ర -అనంతపురం : ప్రభుత్వ వైద్య కళాశాల, అనంతపురంలో 2025-26 బ్యాచ్ లోని ఫస్ట్ ఎంబీబీఎస్ విద్యార్థుల కోసం శరీర నిర్మాణశాస్త్ర విభాగంలో నిర్వహించిన “కాడవరిక్ ఒత్ మరియు వైట్ కోట్ వేడుకను శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అదనపు డీఎంఈ & ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. విజయశ్రీ విద్యార్థులకు సేవా భావం, నిజాయితీ, అంకితభావం, నిబద్ధత వంటి విలువలను ప్రాముఖ్యతనిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు మృతదేహాలను గౌరవంతో చూడాలని, వాటి ద్వారా నేర్చుకోవాలని సూచించారు. వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ షారన్ సోనియా వైద్య వృత్తి సమాజానికి మానవ సేవ చేయడానికి, ఆరోగ్యాన్ని అందించడానికి అవకాశం కలిగించే అత్యంత పవిత్రమైన వృత్తి అని పేర్కొన్నారు. శరీర నిర్మాణశాస్త్ర విభాగంలోని డిసెక్షన్ హాల్లో విద్యార్థులు మానవ శరీర నిర్మాణాన్ని గౌరవంతో మరియు గోప్యతతో అధ్యయనం చేయాలనే ప్రతిజ్ఞ చేశారు. ఈ కాడవర్ ప్రతిజ్ఞను విభాగాధిపతి డాక్టర్ ఎస్. ఉమామహేశ్వరరావు అధ్యాపక బృందంతో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అండర్ గ్రాడ్యుయేట్ కోఆర్డినేటర్, ఫార్మకాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పద్మ శ్రావణి , శరీర నిర్మాణశాస్త్ర విభాగంలోని అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ ఎం. నరేంద్ర నాయక్, డాక్టర్ ఎస్. అహ్మద్ పీర్, డాక్టర్ పి. పద్మజా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. షహజీర్ , ట్యూటర్లు శ్రీ ఎం. పునర్జీవన్ కుమార్, ఓ. భాను , పీజీ విద్యార్థులు మరియు బోధనాతర సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు