Homeఆంధ్రప్రదేశ్ఏపీటీఎఫ్ ఉరవకొండ మండల నూతన కార్యవర్గం ఎన్నిక

ఏపీటీఎఫ్ ఉరవకొండ మండల నూతన కార్యవర్గం ఎన్నిక

- Advertisement -

అధ్యక్షులుగా వేణుగోపాల్
ప్రధాన కార్యదర్శిగా భువనేశ్వరి చౌదరి

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం) : ఏపీటీఎఫ్ ఉరవకొండ మండల నూతన కార్యవర్గం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం స్థానిక ఎస్.కె ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. భాస్కర్, మండల అధ్యక్షులు పాండురంగ, ప్రధాన కార్యదర్శి బిసి ఓబన్న ఆధ్వర్యంలో ఏపీటీఎఫ్ సమావేశాన్ని నిర్వహించారు. నూతన కార్యవర్గం ఎన్నికకు ఎన్నికల అధికారిగా సాకే భాస్కర్ వ్యవహరించారు. నూతన కార్యవర్గంలో గౌరవ అధ్యక్షులుగా రెడ్డి లోకేష్, అధ్యక్షులు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శిగా ఏళ్ళ భువనేశ్వరి చౌదరి, గౌరవ సలహాదారుగా ఓకే. వెంకటేష్ ప్రభు, జిల్లా కౌన్సిలర్లుగా బీసీ ఓబన్న, చంద్రశేఖర్, ఎం శ్రీనివాసులు, సలీం భాష, కె.రాముడు, లలిత,డి. పాండురంగ, ఎస్ రామకృష్ణ, టి. నరసింహులు, ఏం. ఆదినారాయణ, పి భాగ్యమ్మ తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ మండలంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక డీఏ ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న ఆర్థిక బకాలు కూడా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సిపిఎస్ రద్దు చేయాలని 2003 డిఎస్సి వారికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు తిమ్మప్ప, తలారి గోపాల్, ఎం. పరమేశ్వరప్ప, కళ్యాణ్ కుమార్ గౌడ్, నాగరాజు, పంపాపతి తదితరు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు