Homeఆంధ్రప్రదేశ్నాగుల చవితి మహోత్సవ వేడుకలు

నాగుల చవితి మహోత్సవ వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర–దేవరపల్లి:దేవరపల్లి మండలంలో శనివారం నాడు నాగుల చవితి మహోత్సవ వేడుకలు భక్తులు భక్తిశ్రద్ధలతోఘనంగా జరిగాయి ప్రతి గ్రామంలోనూ ఉదయం మహిళలు పిల్లలు పొలాల వద్దకు వెళ్లి పుట్టలో పాలు పోసి పుట్ట వద్ద పూజలు చేశారు దేవరపల్లిలో యాదవోలు రోడ్డులో గల పొలాలలో మహిళలు పిల్లలు పుట్ట వద్దకు వెళ్లి పరిసరాలను పరిశుభ్రం చేసి అగరతులు పండ్లు వెలిగించి పూజలు చేశారు ముఖ్యంగా ఆవు పాలు కోడిగుడ్లు బెల్లంతో తయారుచేసిన చిమిలి తో నైవేద్యం పెట్టి పూజలు చేశారు కుటుంబ సభ్యులతో పొట్టలో పాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ అనాదిగా కార్తీకమాసం ప్రారంభంలో వచ్చే చవితి రోజు నాగుల చవితి అని ఈరోజు పుట్టలో పాలు పోసి పూజిస్తే అష్టైశ్వర్యాలు సుఖసంతోషాలు ఉంటాయని తెలిపారు దేవరపల్లి మండలంలో దేవరపల్లి రామన్నపాలెం దుద్దుకూరు గౌరీపట్నం లక్ష్మీపురం పల్లంట్ల కురుకూరు త్యాజంపూడి ఎర్నగూడెం సంగాయిగూడెం చిన్నాయగూడెం యాదవోలు గాంధీ నగరం బందపురం గ్రామాలలో భక్తులు పుట్టలో పాలు పోసి ముక్కులు తీసుకున్నారు దేవరపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం భక్తులు బారులు తీరి దైవ దర్శనం చేసుకున్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు