Homeఆంధ్రప్రదేశ్జూడోలో ప‌త‌కాలు

జూడోలో ప‌త‌కాలు

- Advertisement -

జూడోలో కందుకూరి రాజ్య‌ల‌క్ష్మి మ‌హిళా క‌ళాశాల విద్యార్ధినుల‌కు ప‌త‌కాలు

విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటి ;  ఇటీవల  ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన జూడో టోర్నమెంట్‌లో స్థానిక శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరచి ఐదు పతకాలు సాధించారు. ఈ క్ర‌మంలో డి.శ్రీల‌క్ష్మి  52కిలోల విభాగంలో బంగారు ప‌త‌కం,  టి.లీలా లక్ష్మి  48 కిలోల విభాగంలో బంగారు ప‌త‌కం ,  కె.జీవిత  70 కిలోల విభాగంలో   వెండి పతకం ,  ఎం.ధనలక్ష్మి  78 కిలోల విభాగంలో వెండి పతకం, కె.స్వర్ణలత  44 కిలోల విభాగంలో  వెండి పతకం సాధించారు. ఈ సంద‌ర్భంగా  కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. రాఘవ కుమారి  విజేతల‌ను  అభినందిస్తూ, వారు కళాశాల కీర్తిని పెంచారన్నారు. కళాశాల ఫిజికల్ డైరెక్టర్లు వై. సుధారాణి ,  ఎ. నాగు విజేతలను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు