Homeఆంధ్రప్రదేశ్వేణూ…! ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు

వేణూ…! ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు

- Advertisement -

— రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల.

విశాలాంధ్ర – కడియం : “వేణూ, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అనవసరంగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది” అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైసిపి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ ను హెచ్చరించారు. కడియం మండలం బుర్రిలంక గ్రామంలో రూ.205 లక్షల వ్యయంతో ఎంజిఎన్ఆర్ఈజిఎస్, మండల పరిషత్ నిధుల ద్వారా మంజూరు చేయించిన బుర్రిలంక కాలువగట్టు నుండి ఏటి గట్టు వరకు సిమెంట్ రోడ్డును మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. ఈసందర్భంగా గోరంట్ల స్ధానిక విలేకరులతో మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గం నుండి 64 వేల ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించారని, మీరు ఏదైనా సాధించి ఉంటే నాకు అంత మెజారిటీ ఎందుకు వస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు. స్థల బలం, కుల బలం ఉండి కూడా గెలవలేక రూరల్ నియోజకవర్గానికి వచ్చి, మూడు సంవత్సరాల పాటు ఇన్చార్జిగా ఉన్న మీరు ఏమి సాధించారని ప్రశ్నించారు. మద్యం వ్యాపారంలో మునిగితేలిన మీకు మద్యం గురించి మాట్లాడే అర్హత లేదని పేర్కొన్నారు. 20 రూపాయలు అధికంగా అమ్ముతున్నారంటూ ఆరోపించిన మీరు, ఎక్కడ అమ్ముతున్నారో నిరూపించాలని సవాల్ విసిరారు. ఇసుకలో, మధ్యంలో, ఉద్యోగాలు ఇస్తానని వివిధ రకాలుగా దోచుకున్న మీకు నా గురించి మాట్లాడడే అర్హత లేదన్నారు. ఇకనైనా జ్ఞానోదయం పొంది జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు