విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి భాష్యం స్కూల్ కు చెందిన ఆరుగురు విద్యార్థులు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు పురుషోత్తపల్లి మరియు నిడదవోలు నందు నిర్వహించిన కొవ్వూరు డివిజన్ స్థాయి చెస్ మరియు అథ్లెటిక్స్ పోటీలలో ప్రతిభ చూపి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారని భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ పి పేరయ్య నాయుడు తెలిపారు. గెలుపొందిన విద్యార్థులు అండర్ 17 చెస్ పి రఘు ప్రబోధ్ వర్మ మొదటి స్థానం,ఎస్ జస్వంత్ రెండవ స్థానం,అండర్ 14చెస్ ఎస్ రచన శాన్వి రెండవ స్థానం, రన్నింగ్ అండర్ 17 ఎం దిగ్విజయ్ మొదటి స్థానం,షార్ట్ పుట్ అండర్ 17 పి చరణ్ అక్షయ్ కుమార్ రెండవ స్థానం,షార్ట్ పుట్ అండర్ 14 ఎన్ లోకేష్ మొదటి స్థానం లను భాష్యం స్కూల్స్ జోనల్ ఇన్చార్జ్ వి ఆంజనేయులు,చాంప్స్ ప్రిన్సిపల్ షేక్ షబానా,ఉపాధ్యాయులు భాష్యం స్కూల్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు.
దేవరపల్లి భాష్యం స్కూల్ ప్రతిభ
- Advertisement -
RELATED ARTICLES


