జూడోలో కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల విద్యార్ధినులకు పతకాలు
విశాలాంధ్ర – రాజమండ్రి సిటి ; ఇటీవల ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన జూడో టోర్నమెంట్లో స్థానిక శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరచి ఐదు పతకాలు సాధించారు. ఈ క్రమంలో డి.శ్రీలక్ష్మి 52కిలోల విభాగంలో బంగారు పతకం, టి.లీలా లక్ష్మి 48 కిలోల విభాగంలో బంగారు పతకం , కె.జీవిత 70 కిలోల విభాగంలో వెండి పతకం , ఎం.ధనలక్ష్మి 78 కిలోల విభాగంలో వెండి పతకం, కె.స్వర్ణలత 44 కిలోల విభాగంలో వెండి పతకం సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. రాఘవ కుమారి విజేతలను అభినందిస్తూ, వారు కళాశాల కీర్తిని పెంచారన్నారు. కళాశాల ఫిజికల్ డైరెక్టర్లు వై. సుధారాణి , ఎ. నాగు విజేతలను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


