విశాలాంధ్ర – తాళ్లపూడి : కేరళ లాటరీ మోసానికి గురైన వ్యక్తి గురించి ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే తాళ్లపూడి కి చెందిన ఓ వ్యక్తి స్మార్ట్ ఫోన్ కొన్న కొత్తలో మీకు లాటరీ తగిలింది బ్యాంక్ అకౌవుంట్ 16వేల 500 రూపాయలు కట్టాలని, 70 లక్షల లాటరీ తగిలిందని ఆగంతకులు ఫోన్ చేశారు. తరువాత 33 వేలు వేస్తే టాక్స్ చెల్లించి మిగతా డబ్బు అకౌంట్ లో వేస్తామని బ్రమ కలిగించారు. ఇదేదో మోసం గా ఉందని ఆ వ్యక్తి డబ్బులు వెయ్యక పొగా దాదాపు రెండు సంవత్సరాలు తరువాత మీ డబ్బు మా దగ్గరే ఉంది అని మళ్ళీ ఫోన్ వచ్చింది. మోసపురితంగా ఉందని, ఫోన్ ఎత్తక పోయినా ఫోన్ వస్తూనే ఉందని పదే పదే వేధిస్తున్నారని తెలిపారు. ఇటువంటి సంఘటనలకు మోసపోవద్దని ఆవ్యక్తి ప్రజలెవ్వరు మోసపోవద్దని వారికి సూచనలు చేస్తున్నారు.
కేరళ లాటరీ తో మోసపోకండి
- Advertisement -
RELATED ARTICLES


