ఆలయాల అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నాం
భాజపా నాయకుడు కంబాల శ్రీనివాసరావు
విశాలాంధ్ర – సీతానగరం : ముగ్గుళ్ళ గ్రామంలో గల గోదావరి మాత ఆలయంకు ఐరన్ గ్రిల్ ఏర్పాటుకు 63వేల రూపాయలు విరాళం అందించిన విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు. సోమవారం ముగ్గుళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలో గల గోదావరి మాత అన్న సమారాధన కార్యక్రమంలో కంబాల శ్రీనివాసరావు హాజరయ్యారు. దీనిలో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు కంబాల శ్రీనివాసరావుకి శాలువ కప్పి, పుష్ప గుత్యం అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ మన ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు స్వదేశీ వస్తువులనే వాడాలని వారికి అవగాహన కల్పించారు. రంపచోడవరం, జగ్గంపేట, రాజానగరం మూడు నియోజకవర్గల్లో పలు ఆలయాల అభివృద్ధికి, విద్య, వైద్య, ఆర్ధిక పరంగా కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. దీనిలో భాగంగానే ఆలయానికి ఇరువైపులా ఐరన్ గ్రిల్ ఏర్పాటుకు 63వేల రూపాయలు విరాళం అందించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


