Homeజిల్లాలుఅనంతపురంమీనాక్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి 50 వీల్ ఛైర్ల అందజేత

మీనాక్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి 50 వీల్ ఛైర్ల అందజేత

- Advertisement -

ఎమ్మెల్యే దగ్గుపాటి చేతుల మీదుగా అందించిన రవికాంత్ రమణ

విశాలాంధ్ర -అనంతపురం : ప్రభుత్వ ఆసుపత్రికి మీనాక్షి ఫౌండేషన్ చైర్మన్ రవికాంత్ రమణ 50 వీల్ చైర్లను, ఆదిత్య అనే మరో దాత 10మిల్క్ ఫీడింగ్ మిషన్లు అందజేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి చేతుల మీదుగా వీటిని శుక్రవారం ఆసుపత్రికి అందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, సూపరిండెంట్ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కోనంకి గంగారామ్, రత్నమయ్య, ఆర్ఎంఓ హేమలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని… వాటిని ప్రాధాన్యత వారిగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వీల్ చైర్ల సమస్య ఉందని చెప్పిన వెంటనే రవికాంత్ రమణ స్పందించారన్నారు. ఆయనకి ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఆస్పత్రిలో ప్రతిరోజు 2వేల మందికి పైగా అవుట్ పేషెంట్లు వస్తున్నారని, 1200 మంది ఇన్ పేషెంట్లు ఉన్నారన్నారు. అయితే ఆసుపత్రికి మాత్రం కేవలం 650 మంది పేషెంట్లకు మాత్రమే బడ్జెట్ వస్తోందన్నారు. అయినప్పటికీ మంత్రి సత్య కుమార్ చొరవ వలన సిఎస్ఆర్ ఫండ్స్ తో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తున్నామన్నారు. ఇప్పటికే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆసుపత్రిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. మదర్ మిల్క్ బ్యాంకు ని ఏర్పాటు చేశామని.. ప్రస్తుతం ఇందులో 160 లీటర్ల వరకు పాలు స్టాక్ ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పిల్లలకే కాకుండా ప్రైవేట్ ఆస్పత్రిలో పిల్లలకు కూడా వీటిని అందిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో తనతో పాటు ఎంపీ అంబికా ఇతర ప్రజా ప్రతినిధులు ఆసుపత్రి పై అనునిత్యం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. గతం కంటే ఇప్పుడు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు. జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కోసం కలెక్టర్ ను ఐదు కోట్లు కావాలని కోరినట్లు చెప్పారు. ఆ నిధులు వస్తే ఇక్కడ మరిన్ని సౌకర్యాలు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్లు పి ఎల్ ఎన్ మూర్తి, పోతుల లక్ష్మీనరసింహులు, పరమేశ్వర్, కడియాల కొండన్న, బొమ్మినేని శివ, బెస్త పవన్ కుమార్, కార్పొరేటర్ బాలాంజనేయులు, కాశీ విశ్వేశ్వర దేవాలయ చైర్మన్ అమిలినేని నరేంద్ర చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు