డి ఎం అండ్ హెచ్ ఒ డాక్టర్ ఈ బి దేవి
విశాలాంధ్ర -అనంతపురం : ప్రస్తుత ప్రజలను పీడిస్తున్న క్యాన్సర్ వ్యాధి నివారణ కేవలం స్క్రీనింగ్ తోనే సాధ్యమవుతుందని డి ఎం అండ్ హెచ్ ఒ డాక్టర్ బి దేవి తెలిపారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినం సందర్భంగా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అనంతపురంలో మేమున్నామని మీకేం కాదని అను నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి తెలుగు తల్లి విగ్రహం వరకు ర్యాలీనీ కొనసాగించారు. ఈ సందర్భంగా డి ఎం అండ్ హెచ్ ఓ మాట్లాడుతూ క్యాన్సర్లు వివిధ మార్గాల ద్వారా వ్యాపిస్తాయన్నారు. ప్రధానంగా రొమ్ము కాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ మరియు నోటి క్యాన్సర్లు అత్యధికంగా వ్యాపిస్తాయన్నారు. వీటిని ప్రాథమిక దశలో గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే నయమవుతాయన్నారు. ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వైద్య సిబ్బంది ఇంటింటికి వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్ ఆఫీసర్స్, గిరిజ మనోహర్ ఓబులు, ఫ్లోరోసిస్ ఆంజనేయులు , డెమో, జిల్లా పొగాకు నియంత్రణ సామాజిక కార్యకర్త బి. శ్రీరాములు , ప్రేమ్, కిషోర్, మౌనిక, శశికల,డెమో, నాగరాజు, గంగాధర్, ఏఎన్ఎం , ఆశ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


