Homeజిల్లాలుఅనంతపురంప్రైవేటీకరణను ఉపసంహరించకపోతే ప్రజా ఉద్యమం తప్పదు

ప్రైవేటీకరణను ఉపసంహరించకపోతే ప్రజా ఉద్యమం తప్పదు

- Advertisement -

ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

విశాలాంధ్ర-ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి సర్కారు ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని దీనిని వెంటనే ఉపసంహరించకపోతే ప్రజా ఉద్యమం తప్పదని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ సమన్వయకర్త వై విశ్వేశ్వర రెడ్డి అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఉరవకొండలో నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక పార్కు ఆంజనేయస్వామి దేవాలయం నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు ఈ నిరసన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా కంఠక పాలన సాగిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ధనార్జనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యంతో పాటు పేద విద్యార్థుల వైద్య విద్య కలను సాకారం చేసే దిశగా అడుగులు వేశారన్నారు. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. అప్పట్లోనే 7 కళాశాలల నిర్మాణాలు పూర్తి చేసి ఐదింట్లో తరగతులు కూడా ప్రారంభించారని గుర్తు చేశారు. 10 మెడికల్ కళాశాలల నిర్మాణాలు 30 శాతం నుంచి 70 శాతం వరకు పూర్తయ్యాయని, మరో రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే.అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం చేయలేదన్నారు.
చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ప్రజా ఉద్యమం’ కోటి సంతకాల సేకరణ విజయవంతంగా కొనసాగుతోందన్నారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఇందులో భాగస్వాములవుతున్నారన్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా కూటమి ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు సర్కారుపై మరింత ఒత్తిడి తేవడానికి మరిన్ని ప్రజా ఉద్యమాలను చేపడతామన్నారు.
వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంచేందుకు చేస్తున్న ప్రయత్నాలను అందరూ ఖండించాలన్నారు. అనంతరం తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా నాయకులు కెవి రమణ, వీరన్న, ఎంపీపీ నరసింహులు, మార్కెట్ మాజీ చైర్మన్ సుశీలమ్మ, మాజీ జెడ్పిటిసి సభ్యులు తిప్పయ్య, మాజీ ఎంపీపీ ఎర్రి స్వామి, పార్టీ నాయకులు ఈడిగా ప్రసాద్,డి. సురేష్, గందోడి మారేష్, బసవరాజు, అశోక్ కుమార్ జగదీష్, అమిలినేని సునీల్, గోవింద నాయక్, ఎర్రి స్వామి రెడ్డి, గోవిందు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తో పాటు వివిధ మండలాలకు చెందిన పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు