Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తాం..

ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తాం..

- Advertisement -


కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ సతీష్ కుమార్

విశాలాంధ్ర ధర్మవరం; ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తామని కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక నేసే పేటలోని కరూర్ వైశ్యా బ్యాంక్ బ్రాంచ్ ధర్మవరం పట్టణంలో స్థాపించి 50 సంవత్సరాల పూర్తి అయిన సందర్భంగా ఖాతాదారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. నిర్వహించారు. దేశవ్యాప్తంగా కరూర్ వైశ్యా బ్యాంక్ బ్యాంకింగ్ రంగంలో109 సంవత్సరాలుగా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తోందని, ప్రత్యేకించి తిరుపతి రీజియన్ లో ని ధర్మవరం కరూర్ వైశ్యా బ్యాంకు బ్రాంచ్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి అయిందని, ఇందుకు సహకరించిన ఖాతాదారులకు, ప్రజలకు, బ్యాంకు సిబ్బందికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రత్యేకంగా ధర్మవరం బ్రాంచ్ 375 కోట్ల టర్నోవర్ ను అధిగమించి 400 కోట్లకు దగ్గరలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది కృష్ణ, రాఘవేంద్ర, శివ, అమర్నాథ్, షఫీ ఉల్లా, భార్గవి, విక్టోరియా రాణి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు