శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయం ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీ ఆదివారం ఉదయం పదిగంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు 117 వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ శిబిరంలో పాల్గొన్న రోగులకు ఉచిత వైద్య చికిత్సలతో పాటు నెలకు సరిపడు మందులను కూడా ఉచితంగా అందించబడునని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు గూండా నారాయణ స్వామి జ్ఞాపకార్థం భార్య గూండా నాగలక్ష్మిమ్మ వీరి కుమారుడు గూండా నాగరాజు (సిద్ధి రాజేష్), అరుణ కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ శిబిరానికి దంత వైద్యులు డాక్టర్ కుళ్లాయప్ప, డాక్టర్ విట్టల్, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ సతీష్ కుమార్, చెస్ట్ నిపుణులు ప్రణయ్, గ్యాస్ట్రో అండ్ లాప్రోస్కిప్ సర్జన్ హైదరాబాద్ డాక్టర్ జైదీప్ నేత లచే రోగులకు వైద్య చికిత్సలతో పాటు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా తెలుపబడుతుందని తెలిపారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు కూడా నిర్వహించబడునని తెలిపారు. కావున పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలు ఈ శిబిరమును సద్వినియోగం చేసుకొని ఆరోగ్యమును పదిలంగా ఉంచుకోవాలని వారు తెలిపారు.
117వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును ప్రజలు సద్వినియోగం చేసుకోండి..
- Advertisement -
RELATED ARTICLES


