Homeజిల్లాలుశ్రీ సత్యసాయినేత్రాలయ ఐ క్లినిక్ లో ఉచిత కంటి వైద్య పరీక్షలు

నేత్రాలయ ఐ క్లినిక్ లో ఉచిత కంటి వైద్య పరీక్షలు

- Advertisement -

నిర్వాహకులు శ్రీకాంత్ రెడ్డి
విశాలాంధ్ర- ధర్మవరం; పట్టణంలోని సుదర్శన కాంప్లెక్స్ పక్కన వివి కాంప్లెక్స్ (మునిసిపల్ కాంప్లెక్స్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గల నేత్రాలయ ఐ క్లినిక్ అండ్ ఆప్టికల్స్ లో ఈనెల 23వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత కంటి వైద్య పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కంటి శుక్లములకు ఆధునిక పరీక్షలు, కార్నియా పరీక్ష, డయాబెటిక్ రెటీనో పతి పరీక్ష, నీటి కాసుల పరీక్ష, రెటీనా పరీక్ష, కంటి నరములు, తలనొప్పి, మైగ్రేన్ పరీక్షలు, దగ్గర చూపు దూరము చూపు, చిన్నపిల్లలకు కంటి పరీక్షలు తదితర వాటిని నిర్వహిస్తామని తెలిపారు. కంటి శుక్లాలు ఉన్నవారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని గుండె జబ్బులు కలవారు పాత రిపోర్టులతో రావాలని తెలిపారు. లావున ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు