జిల్లా గౌరవ అధ్యక్షులు ఓబులు
విశాలాంధ్ర ధర్మవరం : హమాలీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు, సీనియర్ నాయకులు ఎస్హెచ్ భాష, జిల్లా ఉపాధ్యక్షులు అయూబ్ కాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు స్థానిక మార్కెట్ యార్డ్లో సివిల్ సప్లైస్ వర్కర్స్ యూనియన్ సమావేశంనిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు జి.ఓబులు కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ జిల్లా సివిల్ సప్లైస్ హమాలీ కార్మికులకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని,హమాలీలు కొందరికి పేర్లు నమోదు చేయాలని,వారికి పి ఎఫ్ అమలు చేయాలని , ఈ యస్ ఐ పై కోర్టులో ఉన్న కేసును ప్రభుత్వం త్వరిత గతిన పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని వారి డిమాండ్ చేశారు.అదే విధంగా స్వీపింగ్, త్రాగునీరు సప్లయ్ బిల్లులు 9 నెలల గా చెల్లించలేదని ,హామలీల.పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే హమాలీల సమస్యలు పరిష్కరించాలని ,లేనట్లయితే నిరసన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందని జి.ఓబులు.ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రవాణా రంగం జిల్లా నాయకులు రఫీ, సివిల్ సప్లై యూనియన్ జిల్లా కార్యదర్శి నాగరాజు,స్థానిక యూనియన్ నాయకులు, నేలకోటప్ప, లక్ష్మన్న, కదిరెప్ప, హమాలీ.కార్మికులు పాల్గొన్నారు.
హమాలీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి..
- Advertisement -
RELATED ARTICLES


