క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)
విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు వైద్యం చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది అని క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి ) తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగటవీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణము 117వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి 285 మంది రోగులు పాల్గొనడం జరిగిందని, వారందరికీ నిష్ణాతులైన వైద్యులచే వైద్య పరీక్షలు నిర్వహించి ఒక నెలకు సరిపడు. మందులను కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. శిబిరా దాతలుగా కీర్తిశేషులు గూడా నారాయణస్వామి జ్ఞాపకార్థం భార్య గూండా లక్ష్మమ్మ వీరి కుమారుడు గూండా నాగరాజు ,అరుణ (సిద్ధి )రాజేష్ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు. తొలుత వారి పేరిటైనా ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రతి ఒక్కరికి షుగరు, బీపీ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ శిబిరంలో డాక్టర్ వివేక్ కుళ్లాయప్ప,డాక్టర్,వెంకటేశ్వర్లు, డాక్టర్, జైబీ పునేత ,డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ విట్టల్, డాక్టర్ ప్రణయ్, డాక్టర్ విట్టల్ , డాక్టర్ ప్రణయ్ , డాక్టర్ వినయ్ లు వైద్య పరీక్షలతో పాటు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా వివరించడం జరిగిందని తెలిపారు. పేద ప్రజల ఆరోగ్యమే మహా లక్ష్యము అని తెలిపారు. ప్రతినెలా నిర్వహించే ఈ శిబిరానికి పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బందనాదంచిన్ని కృష్ణ, ఎలివేల రాధాకృష్ణ, మామిళ్ళ అశ్వత్ నారాయణ, పెద్దకోట్ల భాస్కర ,పెద్దకోట్ల విజయ్, కా చర్ల నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు వైద్యం చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది
- Advertisement -
RELATED ARTICLES


