విశాలాంధ్ర ధర్మవరం;; కంటిపట్ల ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని కంటి డాక్టర్ మధు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సుదర్శన్ కాంప్లెక్స్ పక్కనగల నేత్రాలయ ఐ క్లినిక్ లో ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరమును నిర్వహించారు. ఈ శిబిరం శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిణ జరిగింది. అనంతరం డాక్టర్ మధు నున్న మాట్లాడుతూ ఈ శిబిరంలో 25 మందికి కంటి వైద్య పరీక్షలను నిర్వహించి తగిన వైద్య చికిత్సలను అందిస్తూ, కంటిపట్ల తీసుకోవలసిన మెలకువలను, సలహా సూచనలను ఇవ్వడం జరిగిందన్నారు. ఈ శిబిరంలో కంటి శుక్లములకు ఆధునిక పరీక్షలు, కార్నియా పరీక్షలు, రెటీనో పద్ధతి పరీక్షలు, నీటి కాసుల పరీక్షలు, కంటి నరముల పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.
కంటిపట్ల ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.. కంటి డాక్టర్ మధు
- Advertisement -
RELATED ARTICLES


