పిట్టల్లా రాలిపోతున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు
ఏపీ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా, కార్యదర్శి నరసింహ రావు
విశాలాంధ్ర -ధర్మవరం ; అవార్డులు రివార్డుల కోసం అత్యుత్సాహం చూపే అధికారులు ఉన్నారని, అధికారుల అత్యుత్సాహము వల్ల పని ఒత్తిడికి లోనై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పిట్టల్లా రాలిపోతున్నారని ఏపీ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా స్టేట్ జనరల్ కార్యదర్శి పులిబండ్ల నరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 22వ తేదీన జీవీఎంసీ లో సచివాలయ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న నూకరాజు ( వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ ) తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా హఠాన్మరణం చాలా బాధాకరం వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థించడం జరిగిందన్నారు. దీనికిగాను బాధసప్త హృదయాలతో ప్రభుత్వాన్ని ఉన్నత అధికారులను సంబంధిత జీవీఎంసీ అనకాపల్లి జోన్ 3 కమీషనర్ అయినటు వంటి చక్రవర్తి పై చట్టపరమైన విచారణ శాఖ పరమైన విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. అలాగే నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని , ఉన్నత అధికారులకు వారు విజ్ఞప్తి చేశారు.మునుముందు ఇలాంటి అధికారుల అత్యుత్సాహానికి మరొక సచివాలయ ఉద్యోగి బలి కాకూడదు – గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రశాంతమైన వాతావరణంలో పనిచేయుటకు తగు చర్యలు గైకొనాలని తెలిపారు.


