విశాలాంధ్ర ధర్మవరం; బాలికల కోసం ప్రతిష్టాత్మక గ్రామీణ క్రికెట్ లీగ్ ప్రారంభమైంది అని, ధర్మారం క్రికెట్ జట్టు మంచి ప్రతిభను కనపరచడం జరిగిందని ధర్మవరం క్రికెట్ కోచ్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లీగ్‌లో భాగంగా బత్తలపల్లిలో ధర్మవరం బాలికల జట్టు , బత్తలపల్లి బాలికల జట్టు మధ్య మ్యాచ్ జరుగగా, టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని బత్తలపల్లి జట్టు నిర్ణయించుకున్నారని తెలిపారు. బత్తలపల్లి జట్టు 16.4 ఓవర్లలో కేవలం 41 పరుగులకే ఆలౌట్ అయింది అని తెలిపారు. ధర్మవరం బాలికల జట్టు బౌలర్లు జి. సాయి జ్యోతి , జి.తనూజ ఒక్కొక్కరికి 5 వికెట్లు పడగొట్టారు అది తెలిపారు. ధర్మవరం జట్టు 42 పరుగుల లక్ష్యాన్ని కేవలం 4.2 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి 9 వికెట్ల తేడాతో గెలిచిందన్నారు. అనంతరం ప్రతిభ కనపరిచిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎం అండ్ డి ఎస్ టి ఎల్ కావేరి , ఆర్ డి టి కుమార్, జడ్.పి.హెచ్ స్కూల్ మాల్యవంతం పి ఈ టి నాగరాజు, ధర్మవరం కబడ్డీ కోచ్ జి. ప్రుద్వి , ధర్మవరం క్రికెట్ కోచ్ రాజశేఖర్ , బత్తలపల్లి క్రికెట్ కోచ్ జయరాములు తదితరులు పాల్గొన్నారు.
క్రికెట్లో ప్రతిభ చూపిన ధర్మవరం జట్టు
- Advertisement -
RELATED ARTICLES


