Homeజిల్లాలుశ్రీ సత్యసాయినాలుగు లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన సిఐటియు నాయకులు

నాలుగు లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన సిఐటియు నాయకులు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్స్ నోటిఫికేషన్కు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక కళా జ్యోతి సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ నోటిఫికేషన్ కాఫీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. ఓబులు మాట్లాడుతూ బీహార్ లో ఎన్నికలు జరిగిన అనంతరం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రపూరితంగానే కోట్లాదిమంది కార్మికులకు అన్యాయం జరుగుతున్న దేశంలో కేవలం ఒక శాతం మాత్రమే ఉన్నటువంటి కార్పొరేట్లకు అనుకూలంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం, చట్టాలని సవరించడం చాలా దుర్మార్గం అన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దుచేస్తూ, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 10,కార్మిక సంఘాలు ఈనెల 26వ తేదీన నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ లేబర్ కోడ్స్ను ఉపసంహరించుకోకపోతే,
కార్మికులు, ఉద్యోగులను కలుపుకొని దేశవ్యాప్తంగా, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో
రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న, సిఐటియు సీనియర్ నాయకులు ఎస్ హెచ్.బాషా, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అయూబ్ ఖాన్, సిఐటియు నాయకులు జె,వి, రమణ, ఎల్.ఆదినారాయణ, సిపిఎం పట్టణ కార్యదర్శి మారుతి, చేనేత కార్మిక సంఘం నాయకులు హరికుమార్, ట్రాన్స్పోర్ట్ రంగం టౌన్ ప్రెసిడెంట్ రఫీ, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు బాబు, ముకుంద, లక్ష్మీ ఓబులేసు, అంగన్వాడి నాయకురాలు దీన, షేక్షావలి, ఆటో కార్మికులు, జబీవుల్లా. గోపాల్. మంజు, బాబాఫక్రుద్దీన్,
తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు