విశాలాంధ్ర ధర్మవరం; జిల్లాస్థాయి జూడో పోటీల్లో ధర్మవరం పట్టణానికి చెందిన జీవీఈ జడ్పీ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినిలు ప్రతిభ కనపరచడం జరిగిందని జూడో కోచ్ భాషా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నవంబర్ 21వ తేదీన అనంతపూర్ ఆర్టీడీ స్టేడియంలో జిల్లాస్థాయి జూడో పోటీలు నిర్వహించడం జరిగిందని, ఈ పోటీలలో ధర్మవరం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరచడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం సుమన మా పాఠశాల నుండి జూడో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనటువంటి విద్యార్థిని ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరెన్నో విజయాలు సాధించాలని, నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ధర్మవరం కళాజ్యోతి గల ఉన్నటువంటి పాఠశాలలో విద్యార్థులు ఎనిమిదవ తరగతి చదువుతున్న అండర్ 14. మైనస్ 32 కేజీ విభాగంలో వి.సింధు అండర్.19 మైనస్ 36 కేజీ విభాగంలో వి జి.యువ సంధ్య గోల్డ్ మెడల్ అలానే అండర్ 14 మన 36 కేజీ. విభాగంలో దాక్షాయిని గోల్డ్ మెడల్ సాధించి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అవడం జరిగిందినీ తెలిపారు. తదుపరి పాఠశాల హెడ్మాస్టర్ సుమన, ఉపాధ్యాయులు, పిఈ టి స్వరూప, సరళజూడో కోచ్ ఇనాయత్ భాషా ను అభినందించారు.
జిల్లాస్థాయి జూడో పోటీల్లో జీవీఈ జడ్పీ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినిల ప్రతిభ
- Advertisement -
RELATED ARTICLES


