- Advertisement -
సినిమా డైరెక్టర్ గీతాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
— రాజమండ్రి రూరల్ దళిత నాయకులు.
విశాలాంధ్ర – కడియం : దళితుల మనోభావాలను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సినిమా డైరెక్టర్ అన్నందేవుల గీతాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం దళిత నాయకులు కడియం పోలీస్ స్టేషన్ లో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాయల సత్యనారాయణ, దమ్ము కృష్ణంరాజు, మంగమూరి చినబాబు, జల్ది కృపారావు, కనికల్ల బుల్లియ్య, ఇప్పర్తి శ్రీను తదితర దళిత నాయకులు పాల్గొన్నారు.


