Homeఆంధ్రప్రదేశ్కాంగ్రెస్‌ పార్టీకి జిల్లా అధ్యక్షుడు కావాలి

కాంగ్రెస్‌ పార్టీకి జిల్లా అధ్యక్షుడు కావాలి

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : డీసీసీ అధ్యక్షుడు కావాలను కున్నావా దరఖాస్తు చేసుకోండి అని కాంగ్రెస్‌పార్టీ అదిష్టానం కోరుతుంది. గత 9 నెలలుగా డీసీసీ అద్యక్షుడు పదవీ ఖాళీగా ఉంది.ఖాళీగా ఉన్న అద్యక్షత పదవికి దరఖాస్తులు చేసుకోవాలని ఇటీవల పార్టీ అదిష్టానం పిలుపు నివ్వడం జరిగింది. కర్నూలు జిల్లా ఒకప్పటి కాంగ్రెస్‌పార్టీ అడ్డా .కాంగ్రెస్‌పార్టీకి ఉద్దండులను అందించిన జిల్లా కోట్ల విజయబాస్కర్‌రెడ్డి, దామోదరం సంజీవయ్య, పెండేకంటి వెంకటసుబ్బయ్య, మాచాని సోమప్ప, రాచోటి రామయ్య, కోసిగి దొరలు, లక్ష్మీకాంతరెడ్డి లాంటి ఉద్దండులను కాంగ్రెస్‌పార్టీకి అందించిన జిల్లా. టీడీపీ అధికారంలోకి రాకముందు వచ్చిన తరువాత కూడా తనదైన ముద్ర వేసుకుంది. దేశానికి తొలి తెలుగు ప్రదానిని అందించిన జిల్లా కూడా ఉమ్మడి కర్నూలు జిల్లానే . దామోదరం సంజీవయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏఐసీసీ అద్యక్షులుగా పనిచేయగా, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పెండేకంటి వెంకటసుబ్బయ్య కేంద్ర మంత్రిగా,గవర్నర్‌గా పనిచేశారు. కర్నూలు డీసీసీ అద్యక్షులుగా గతంలో మహామహులు పనిచేసినా ఇటీవల డీసీసీ అద్యక్షులుగా రఘరామిరెడ్డి, బీవై రామయ్య, సుధాకర్‌బాబు, మధన్‌గోపాల్‌, లక్కసాగరం లక్ష్మీరెడ్డి, సర్ధార్‌బుచ్చిబాబు, అహ్మద్‌ అలీఖాన్‌, బాబూరావు, మురళీకృష్ణ తదితరులు పనిచేశారు. డీసీసీ అధ్యక్షునిగా పనిచేస్తూ పలు ఆరోపణలు రావడంతో అదిష్టానం మురళీకృష్ణను 9 నెలల క్రితం సస్పెండ్‌ చేసింది.అప్పటి నుండి డీసీసీ పీఠం ఖాళీగా ఉంది. పీసీసీ అద్యక్షురాలుగా వైఎస్‌ షర్మిలా వచ్చిన తరువాత అయినా జిల్లా కాంగ్రెస్‌పార్టీ పుంచుకుంటుందని చూసినా ఏమాత్రం మార్పు రాలేదు. కోట్ల కుటుంబం కర్నూలు జిల్లాలో కాంగ్రెస్‌పార్టీని ఒంటి చేత్తో నడిపిన చరిత్ర ఉంది. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మృతి చెందిన తరువాత ఆయన తనయుడు కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి కర్నూలు ఎంపీగా పనిచేయడమే కాకుండా కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్‌పార్టీలో కోట్ల కుటుంబం ఏమి చేబితే అదే వేదంగా ఉండేది. 2019 ఎన్నికలలో కోట్ల కుటుంబం టీడీపీలో చేరడంతో కాంగ్రెస్‌పార్టీకి పెద్దదిక్కులేకుండా పోయింది.డీసీసీ అద్యక్షుని నియామకం కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఏఐసీసీ పరిశీలకులు కోరడం జరిగిందని ఆపార్టీ శ్రేణులు చెపుతున్నాయి. మరి నూతన అద్యక్షుని ఎన్నిక ఈ సారైనా జరుగుతుందా లేదా వేచిచూద్దాం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు