Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

- Advertisement -

హెడ్మాస్టర్ సివి. శేషు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శివానగర్లో బ్రిలియంట్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని హెడ్మాస్టర్, కరెస్పాండెంట్ సివి. శేషు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సత్య చిన్నపిల్లల హాస్పిటల్ వారిచే ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. మొత్తం 600 మంది కు వైద్య పరీక్షలను నిర్వహించి ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించడం జరిగిందన్నారు. ఈ శిబిరంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పట్టణ ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం సంతోషాదాయకమని తెలిపారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు, దంత పరీక్షలు, ఇతర అనారోగ్య వాటికి కూడా వైద్య చికిత్సలు అందించారని తెలిపారు. ఈ శిబిరంలో డాక్టర్ విక్రాంత్, దంత వైద్యులు మనోజ్ కుమార్, డి ఏ ఓ నాగరాజు ఆచారి, ఆసుపత్రి సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు