విశాలాంధ్ర ధర్మవరం;; హాకీ లో మండల పరిధిలోని చిగిచెర్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను ఘనపరచడం జరిగిందని హెడ్మాస్టర్ తిమ్మారెడ్డి, పిడి ప్రతాపరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 22 నుండి 24 వరకు జరిగిన రాష్ట్రస్థాయి అండర్ 14 బాల బాలికల పోటీలలో ఉత్తమ ప్రతిభ చూపి ఉమ్మడి అంతఃపురం జిల్లా జట్టు విజయం సాధించడం లో ముఖ్య పాత్ర పోషించారు అని తెలిపారు. బాలికల జట్టు రాష్ట్ర స్థాయి లో రెండవ స్థానం, బాలుర జట్టు మూడవ స్థానంలో నిలిచాయి అని తెలిపారు. చిగిచెర్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు కావ్యశ్రీ ,భానుశ్రీ, మనోజ్, అభినాష్, అజయ్ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు అని తెలిపారు. ఈ టోర్నమెంట్ లో చిగిచర్ల విద్యార్థి మనోజ్ బెస్ట్ ప్లేయర్ అవార్డు సాధించాడు అని తెలిపారు.
విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిమ్మారెడ్డి, పిడి ప్రతాపరెడ్డి, పాఠశాల కమిటీ, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
హాకీ లో చిగిచర్ల విద్యార్థుల ప్రతిభ
- Advertisement -
RELATED ARTICLES


