ప్రిన్సిపాల్ సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన రావడం జరిగిందని ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. ముఖ్య అతిథులుగా ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి హరికృష్ణ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ, యువకులు మెగా జాబ్ మేళా ని సద్వినియోగ పరుచుకోవాలి అని తెలిపారు.
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆధ్వర్యంలో ప్రభుత్య పాలిటెక్నిక్ కళాశాల, ధర్మవరం లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా ధర్మవరం నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా నిర్వహించటం నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం లభించడం శుభదాయకమన్నారు. ఈ జాబ్ మేళాకి 10 కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు అని తెలిపారు.
యువతీ యువకులు వారి తల్లిదండ్రుల పై ఆధారపడకుండా ఇటువంటి జాబ్ మేళాల ద్వారా ఉద్యోగ అవకాశాలు పొంది వారి తలపై వారు నిలబడాలని తెలియజేశారు. త్వరలో సంస్కృతి ఫౌండేషన్ ద్వారా మరి నీ జాబ్ మేళా నిర్వహించి యువతకు ఉపాధి కల్పించడంలో ధర్మవరం నియోజకవర్గ శాసనసభ్యులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ కృషి చేస్తున్నారని తెలియజేశారు.
ఈ జాబ్ మేళా కు సుమారు 193 మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా అందులో 81 మంది వివిధ కంపనీలకు ఎంపిక కావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో
ఈ యొక్క జాబ్ మేళ కార్యక్రమంలో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిబ్బంది, సీడాప్ సిబ్బంది, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.


