చిన్న తిరుపతి భక్తుల సేవలో 3 ఎఫ్ ఆయిల్ పామ్ యాజమాన్యం
విశాలాంధ్ర – నల్లజర్ల : భక్తుల కొంగు బంగారం చిన వెంకన్న శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధికి దర్శనార్ధం సుదూర తీరాలనుండి ప్రతినిత్యం కాలినడకన వచ్చే భక్తుల సౌకర్యార్థం నల్లజర్ల మండలం. అయ్యవరం వద్ద 3 ఎఫ్ ఆయిల్ పామ్ యాజమాన్యం విశ్రాంత మందిర సముదాయాలను నిర్మించారు3 ఎఫ్ ఆయిల్ పామ్ సీఈఓ ఆశిష్ గోయోంకా శుక్రవారం విశ్రాంత సముదాయాలను ప్రారంభించారు ఈసందర్భంగా ఆశిష్ గోయోంకా మాట్లాడుతూ కాలినడక భక్తుల సౌకర్యార్థం మరింత విస్తృత సేవలను చేపడతామని తెలిపారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో 3f ఆయిల్ పామ్ జనరల్ మేనేజర్లు వెంకటరామయ్య కరుటూరి రామకృష్ణ కిలారు శ్రీనివాసరావు విజయ ప్రసాద్ హనుమాన్ నరేంద్ర రెడ్డి వడ్లమూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొని భక్తులకు అల్పాహారం మజ్జిగ త్రాగు నీరు అందించారు 3 ఎఫ్ యాజమాన్యం చేపట్టే సేవా కార్యక్రమాల పట్ల కాలినడక భక్తులు స్థానికులు అభినందనలు తెలిపారు


