మహిళలు ఆత్మ నిర్భరత సాధించినప్పుడే దేశాభివృద్ధి సాధన.
ఎంపీ పురందేశ్వరి.
విశాలాంధ్ర – అనపర్తి : మహిళలు ఆత్మ నిర్భరత సాధించినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు. అనపర్తి మండలం రామవరం లో “ఆత్మ నిర్భర్ భారత్”లో కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆమె పాల్గొన్నారు. అనపర్తి మండలం రామవరం గ్రామంలోని ఎస్విఆర్ ఫంక్షన్ హల్ లో “ఆత్మ నిర్భర్ భారత్ – సంకల్ప అభియాన్” కార్యక్రమంలో భాగంగా మహిళా సమేళనం శనివారం ఘనంగా నిర్వహించారు. అనపర్తి పరిధిలోని గ్రామాల నుంచి వందలాది మహిళలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, కేంద్ర ప్రభుత్వం అమలు అమలు చేస్తున్న పథకాలన్నీ గ్రామస్థాయిలో ప్రజలకు వివరించాలని అన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రధాని ప్రారంభించిన ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ కీలకమని, గ్రామీణ మహిళలు బలపడితే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని అన్నారు. మహిళలకు నైపుణ్యాభివృద్ధి, రుణ సౌకర్యాలు, చిన్న పరిశ్రమల స్థాపనకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలను వివరించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ – అనపర్తి నియోజకవర్గంలో మహిళల కోసం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, స్వయం ఉపాధి శిక్షణల అవకాశాల గురించి చెప్పారు. “గృహిణి నుంచి గ్రూప్ లీడర్ కి ఎదిగే శక్తి మహిళల్లో ఉందన్నారు ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి” అని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పట్టు కొమ్ములని అన్నారు. ఈ కార్యక్రమాలు మహిళల్లో నాయకత్వ నైపుణ్యాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు భాగంగా జన్మభూమి హల్ట్ తెచ్చామని, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కృషి ఎంతో ఉందని తెలిపారు. ఐక్యరాజ్యసమితిలో దేశవానిని వినిపించిన ఎంపీ పురందేశ్వరిని గజమాలతో ఘనంగా సత్కరించారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా మేమంటూ అందజేశారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పి. నాగేంద్ర, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కళ్యాణ్ చక్రవర్తి, అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సూర్యకుమారి జిల్లా ఉపాధ్యక్షులు సురేంద్ర రెడ్డి, అధిక సంఖ్య లో మహిళలు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


