రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరిపించాలి
త్వరలో జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీల కు వినతి పత్రాలు
విశాలాంధ్ర – రాజమండ్రి సిటి ; జర్నలిజం వృత్తిగా కొనసాగుతున్న జర్నలిస్టులను రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గత ఆరేళ్లుగా అనధికారికంగా తిష్ట వేసిన రాజమండ్రి ప్రెస్ క్లబ్ కార్యవర్గం పెద్దలు తోటి జర్నలిస్టుల పై వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా దశల వారి పోరాటం చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ పోరాటంలో భాగంగా రెండవ సమావేశం స్థానిక ఆర్పిసి కార్యాలయంలో జరిగింది. ఆర్టీసీ వ్యవస్థాపక అధ్యక్షులు, న్యాయవాది, మేడా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సుమారు 30 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ఎన్నికలు జరగకుండా గత ఆరేళ్లు గా అనధికారంగా కొనసాగుతున్న ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ కార్యవర్గం, పెద్దల వ్యవహార శైలిని నిరసిస్తూ వెంటనే ఎన్నికలు జరిపించాలని హాజరైన సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు, జిల్లా ఎస్పీకు త్వరలో వినతి పత్రాలు సమర్పించాలని తీర్మానించారు. ఈ తీర్మానానికి సభ్యులందరూ ఆమోదం తెలపడమే కాకుండా, ఐక్యంగా పోరాటం చేయడానికి సంసిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు. మెజారిటీ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించని ఎడల యూనియన్లకతీతంగా ప్రెస్ క్లబ్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టడానికి సంసిద్ధమవుతున్నట్లు తెలిపారు. తమ ఉద్యమం వ్యక్తిగతంగా ఎవరికి వ్యతిరేకం కాదని, సంస్థాగతంగా జరుగుతున్న లోపాల పైన , ఎన్నికలు జరగాలని , కార్యవర్గం ఏర్పడాలని జరుగుతున్న పోరాటమేనని మెజారిటీ సభ్యులు స్పష్టం చేశారు. గత ఆరేళ్లుగా ప్రస్తుత కార్యవర్గం జవాబుదారితనం లేకుండా వ్యవహరించడం. క్లబ్బుకు వచ్చిన ఆదాయ, వ్యయాల జమా లెక్కలను సమర్పించకపోవడం, వృత్తి లోకి నూతనంగా ప్రవేశించిన సభ్యులకు సభ్యత్వం ఇవ్వకపోవడం, కొంతమంది జర్నలిస్టులను వ్యక్తిగతంగా ప్రెస్ క్లబ్ లోకి ప్రవేశం నిరాకరించడం, ప్రయివేటు సంస్థల కార్యకలాపాలను ఏకపక్షంగా నిరోధించడం వంటి అంశాల పై చర్చించడం జరింగింది. ఈ సమావేశానికి హాజరు అయిన సభ్యులు ఐక్య పోరాటం చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఐదుగురితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటుకు సభ్యులు అంగీకారం తెలిపారు. ఈ సమావేశం లో రవికుమార్, చేబోలు రాజు,దామోదర్,,వెంకటేష్, సోమరాజు, పురుషోత్తం, డి విశాలాక్షి, రత్న కిషోర్, కె మధు, ఈశ్వర్, గిరీష్ కుమార్, సాయిరాం, శేఖర్, సాయి, రమేష్, నజీర్, మహేష్, దొరబాబు, సత్య నారాయణ, యాకూబ్, సుబ్బు, నాగరాజు, వెంకటేశ్వరరావు, వీరబాబు, బాలు, తదితరులు పాల్గొన్నారు.


