Homeజిల్లాలుశ్రీ సత్యసాయివాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ విజయవంతం చేయండి

వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ విజయవంతం చేయండి

- Advertisement -

మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర- ధర్మవరం; ఈనెల 11వ తేదీన కాలేజీ సర్కిల్లో భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణను అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అనంతరం కాలేజ్ గ్రౌండ్‌లో ప్రజా సమావేశం, అలాగే ధర్మవరం ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు, విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాలు అత్యంత భారీ స్థాయిలో నిర్వహించబడనున్నాయి అని తెలిపారు.
ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ విచ్చేయనున్నారు అని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎన్డీయే నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు అని తెలిపారు. ఈ విశిష్ట కార్యక్రమాలకు
ఈ సమావేశానికి మండల అధ్యక్షులు ఆకులేటి భాస్కర్అధ్యక్షత వహించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే ఓబులేష్, బీజేపీ సీనియర్ నాయకులు ఆకులేటి వీరనారప్ప , జడ్పిటిసి కోటి సుధ , మండల కమిటీ సభ్యులు సత్యనారాయణ నెట్టెం రామకృష్ణ, కావేటి మల్లికార్జున, పిల్లల చౌదరి ముష్టూరు స్వామి , కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు