: క్రికెట్ కోచ్ రాజశేఖర్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఆర్డిటి క్రీడా మైదానంలో క్రికెట్ మ్యాచ్ ఉత్సాహపరితంగా జరిగిందని క్రికెట్ కోచ్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం, హిందూపురం మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది అని, హిందూపురం జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది అని తెలిపారు. ధర్మవరం జట్టు 40 ఓవర్లలో 242/10 స్కోర్ చేసింది అన్నారు.ధర్మవరం బ్యాటింగ్లో టి. గణేష్ 98 బంతుల్లో 89 పరుగులు చేయగా సి. జావిద్ 30 బంతుల్లో 43 పరుగులు, కుంధన్ 27 బంతుల్లో 31 పరుగులు చేశారన్నారు. రిప్లయ్గా హిందూపురం 187 పరుగులకు ఆలౌట్ కాగా హిందూపూర్ కు చెందిన చరణ్ 51 బంతుల్లో 50 పరుగులు చేయడం జరిగిందన్నారు. ధర్మవరం బౌలర్లలో ఎం కుందన్ 3 వికెట్లు, సాయి సంతోష్ 2 వికెట్లు తీశారన్నారు. అనంతరం ఆస్ట్రో ఫ్యాషన్ యజమాని హరి రెండు జట్ల ఆటగాళ్లకు భోజనం ఏర్పాటు చేయడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. భారత క్రికెట్ ఆటగాడు శిఖర్ ధావన్ కు ప్రపంచంలోనే అతి పెద్ద అభిమాని అయిన శంకర్ ధావన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్ ఎం. కుంధన్, బ్యాటరీ గణేష్ లకు స్పోర్ట్స్ టీషర్టులను బహుకరించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. మ్యాచ్ తర్వాత ఆర్డీటీ ఏరియా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు క్రికెట్ కోచ్ రాజశేఖర్ జట్లను అభినందించారు.
ఉత్సాహపరితంగా క్రికెట్ మ్యాచ్
- Advertisement -
RELATED ARTICLES


